బెంగళూరు, పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా, వైట్‌వాష్‌ను తప్పించుకోవాలంటే భారత్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇక ఈ పరిస్థితిని బట్టి చూస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ మార్గం కష్టంగా మారుతోంది. ఇదే విషయాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా వ్యక్తపరిచాడు. టీమిండియా పేలవ ప్రదర్శనపై విచారం వ్యక్తం చేసిన కుంట్లే.. WTC ఫైనల్ కు వెళ్లడం టీమిండియాకు కఠినమైనది అని పేర్కొన్నాడు.
ప్రతి మ్యాచ్ కీలకమే
ఆయన మాట్లాడుతూ.. ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఉండే మాజానే ఇది అని పేర్కొన్న కుంబ్లే. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోవడంతో తదుపరి ప్రతి టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ పరాజయాలను అధిగమించి భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం కష్టంగా మారింది.
భారత్ WTC ఫైనల్‌కు చేరుకోవడాని ఐదు టెస్ట్ మ్యాచ్ విజయాలు అవసరమని మేము సిరీస్ ప్రారంభానికి ముందు మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు వచ్చే ఆరు మ్యాచ్‌ల్లో కనీసం 4 విజయాలు సాధించాల్సి ఉంది. ఇది మరింత కష్టం. కనీసం వాంఖడే స్టేడియం వేదికగా జరిగే 3వ టెస్టు మ్యాచ్‌లోనైనా గెలిస్తే.. ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లోనైనా ఒత్తిడిని కాస్త తగ్గించుకోవచ్చు.
బ్యాటింగ్ మెరుగుపడాలి
భారత బౌలింగ్ లైనప్ బాగా రాణిస్తోంది మరియు టెస్ట్ మ్యాచ్‌లో 20 వికెట్లు తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ కారణంగానే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఆందోళన అంతా భారత్ బ్యాటింగ్ పైనే.. బ్యాట్స్‌మెన్ త్వరగా లయను దొరకబుచ్చుకుని మంచి ప్రదర్శన చేయాలని అమిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన గత 2 సిరీస్‌లలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే ఇప్పుడు WTC ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా బ్యాటింగ్ మెరుగవాల్సిన అవసరముంది. ఇప్పటి వరకు టీమిండియా బౌలింగ్ కారణంగానే టేబుల్ టాపర్లుగా నిలిచారు. అయితే ఇప్పుడు కూడా టెబుల్ టాపర్లుగా నిలవాలంటే బ్యాటర్లు పరుగులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత్ 62.82 సగటు స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ ఆస్ట్రేలియా జట్టు 62.50 సగటు స్కోరుతో స్వల్ప తేడాతో 2వ స్థానంలో నిలిచింది. తదుపరి సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్నందున రెండో స్థానంలో ఉన్న శ్రీలంకకు ఫైనల్ చేరుకునే అవకాశముంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ను భారీ తేడాతో గెలిస్తేనే భారత్ టాప్ 2లో నిలవగలదు. లేకుంటే శ్రీలంక, దక్షిణాఫ్రికాలు కచ్చితంగా ముందడుగు వేస్తాయి.