రాష్ట్రంలో మార్కెటింగ్‌ శాఖలో 32 మందికి పదోన్నతులు: మంత్రి నిరంజన్ రెడ్డి

32 Officials of Marketing Department of Telangana Got Promotions

మార్కెటింగ్ శాఖలో పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ 27 విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 11 మంది గ్రేడ్-1 కార్యదర్శులకు స్పెషల్ గ్రేడ్ కార్యదర్శులుగా పదోన్నతి ఇచ్చామన్నారు. అలాగే మార్కెటింగ్ సంచాలకుల కార్యాలయం నుండి మరో 21 మంది అసిస్టెంట్ కార్యదర్శులకు గ్రేడ్-1 కార్యదర్శులగా పదోన్నతులు లభించాయన్నారు. మొత్తం 32 మందికి పదోన్నతులు వచ్చాయని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, శాఖాపరంగా ఉద్యోగులకు రావాల్సిన వాటి విషయంలో ఎక్కడా కాలయాపన ఉండదని అన్నారు. మార్కెటింగ్ శాఖలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా పదోన్నతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ