కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి, పలువురికి అస్వస్థత

AP Political Updates, AP Politics, Eluru, Eluru Disease, Eluru Mysterious Disease Victims, Eluru Mystery Disease, Eluru News, eluru news today, Health Minister Alla Nani, Jagananna, Komirepalli Village, Mysterious Disease in Denduluru, Mysterious Illness Erupted In AP, Mysterious Illness Erupted in Komirepalli Village, p news, Strange disease, Strange disease in West Godavari district, telugu news, Victims Of Mysterious Disease in Denduluru, West Godavari District

పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం నాటికి 25 మంది అస్వస్థతకు గురికాగా, తాజాగా మరో నలుగురు వింతవ్యాధి లక్షణాల బారినపడ్డట్టు తెలుస్తుంది. కళ్లు తిరగగడం, ఆకస్మికంగా కింద పడిపోవటం, నోటి వెంట నురగలు రావటం, నీరసం, ఫిట్స్ వంటి లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన వారిలో చికిత్స అనంతరం 21 మంది కోలుకున్నారు. కొందరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పూళ్ల, కొమిరేపల్లి గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గ్రామాల్లో అంబులెన్సులు అందుబాటులో ఉంచి, మెడికల్ బృందాలతో ఇంటింటి సర్వే చేయించారు. అలాగే సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ ‌ కూడా పూళ్ల, కొమిరేపల్లి గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అస్వసతకు కారణమైన లక్షణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ఘటనపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతామని అధికారులు ప్రజలకు భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =