హైదరాబాద్ లో 200 కి చేరిన ‘బ‌స్తీ ద‌వాఖానాల’ సంఖ్య

33 New Basthi Dawakhanas Establishing In GHMC, Basthi Dawakhana of Hyderabad, Basthi Dawakhana Telangana, Basthi Dawakhanas, GHMC, New Basthi Dawakhanas, telangana, Telangana News

హైదరాబాద్ న‌గ‌రంలో ఉన్న పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ వైద్యాన్ని మ‌రింత చేరువ చేసేందుకు కొత్త‌గా 33 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి ద్వారా వ‌స‌తి, ఇత‌ర మౌలిక వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆధ్వ‌ర్యంలో వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బందిని నియ‌మించి కాల‌నీవాసుల‌కు ప్రాథ‌మిక వైద్య సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆకాంక్ష‌ల మేర‌కు పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే కాల‌నీలు, బ‌స్తీల‌కు ప్ర‌భుత్వం వైద్యాన్ని చేరువ చేసేందుకు బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా 2019 లో ఏర్పాటు చేసిన 123 బ‌స్తీ ద‌వాఖానాల‌కు అద‌నంగా మే 22, 2020న మ‌రో 44 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశాల మేర‌కు జిహెచ్‌ఎంసి ప‌రిధిలో ప్ర‌తి వార్డుకు క‌నీసం రెండు చొప్పున బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంలో భాగంగా మ‌రో 33 బ‌స్తీ ద‌వాఖానాలను ప్రారంభించుట‌కు అనువుగా వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ తెలిపారు. దీంతో హైదరాబాద్ లో మొత్తం బ‌స్తీ ద‌వాఖానాల సంఖ్య 200 ల‌కు చేరుకుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu