కరోనాతో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కన్నుమూత

Former Health Minister of Goa, Former Health Minister of Goa Suresh Amonkar Died, Goa Coronavirus, Goa Former Health Minister, Goa Former Health Minister Died, goa health minister news, Health Minister of Goa Suresh Amonkar Died due to Covid-19, Suresh Amonkar Died due to Covid-19

కరోనా సోకడంతో గోవా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సురేష్ అమోంకర్ జూలై 6, సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. సురేష్ అమోంకర్ కు జూన్ 22 న కరోనా పాజిటివ్ గా తేలగా, మార్గవ్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. సురేష్ అమోంకర్ మృతి పట్ల గోవా ముఖ్యమంత్రి ప్ర‌మోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వ‌జిత్ రాణె స‌హా ప‌లువురు రాజకీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

అమోంకర్ బీజేపీ గోవా యూనిట్ కి అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. అలాగే 1999, 2002 లో ఎమ్మెల్యేగా గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా మనోహర్ పారికర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. మరోవైపు గోవాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1813 కి చేరుకుంది. ఇప్పటికి 8 మంది మరణించగా, 1061 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =