తెలంగాణ రాష్ట్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద నివాళర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ