తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Actor Mahesh Babu Emotional Post About His Father Superstar Krishna,Mahesh Babu's Emotional Post,Remembering His Father Superstar Krishna,Superstar Krishna Death,Mango Enws,Mango News Telugu,Superstar Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Mahesh Babu,Actor Mahesh Babu News And Updates,Actor Mahesh Babu Twitter,Actor Mahesh Babu Emotional Post,Super Star Mahesh Babu,Krishna Super Star

ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ నవంబర్ 15వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకుంటూ ప్రముఖ నటుడు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రి కృష్ణ మరింత గర్వపడేలా నడుచుకుంటానని మహేష్ బాబు పేర్కొన్నారు.

“నీ జీవితం గొప్పగా సాగింది. మీరు వెళ్లిపోవడం కూడా అంతే గొప్పగా జరిగింది. మీ గొప్పతనం అలాంటిది. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యమైన మరియు చురుకైన స్వభావం మీది. నా స్పూర్తి, నా ధైర్యం మరియు నేను చూసుకున్నవన్నీ మరియు నిజంగా ముఖ్యమైనవి అన్నీ అలాగే వెళ్లిపోయాయి. కానీ విచిత్రంగా నేను ఇంతకు ముందెన్నడూ లేని ఈ శక్తిని నాలో అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా. మై సూపర్ స్టార్” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE