నా కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి – టీడీపీ అధినేత చంద్రబాబు

Tdp Chief Chandrababu Naidu Participates Aquaculture Farmers Seminar At Mangalagiri Party Office Today,With My Visit To Kurnool, Tremors Started In Ycp,Tdp Chandrababu,Tdp Chief Chandrababu Naidu,Mango News,Mango News Telugu,Ap Cm Ys Jagan Mohan Reddy , Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates,Aquaculture Farmers Seminar,Tdp Mangalagiri Party Office

తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆక్వా కల్చర్ రైతుల రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు సహా పార్టీలోని పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆక్వా రంగానికి ఇదేమి కర్మ’ అనే పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగానికి అన్యాయం చేస్తోందని, వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆక్వా రంగానికి సబ్సిడీలు అందుబాటులో లేవని, చాలా మంది రైతులు తీవ్ర నష్టాలు చవిచూసి, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అందుకే ఆక్వా రైతుల సమస్యలపై టీడీపీ ప్రధానంగా దృష్టి సారించనుందని, వారి ప్రయోజనాల కోసం పోరాడేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఇక తన కర్నూలు పర్యటన అనంతరం అధికార వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని, ఏకంగా 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చేయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. తన పర్యటనకు లభించిన ప్రజాదరణను చూసిన సీఎం జగన్, ప్రభుత్వంపై వ్యతిరేకత గమనించారని, అందుకే పార్టీలో ప్రక్షాళనపై దృష్టి సారించారని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజాగ్రహం పెల్లుబికుతుందని, ఈసారి ఎన్నికల్లో వైసీపీ పులివెందులలో కూడా గెలవలేదని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here