పల్లా, మల్లారెడ్డిలకు రేవంత్ సర్కార్ షాక్

Another Shock For Palla And Mallareddy, Shock For Palla And Mallareddy, Janagam, Mallareddy, Medchal MLA, Palla Rajeshwar Reddy, Revant Sarkar, Shock For Mallareddy, HYDRA, HYDRA Continues Demolition, Hydra List, Latest Hydra News, Hydra Live Updates, Hyderabad, Illegal Contructions, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, విద్యాసంస్థల ఛైర్మన్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి రకరకాల వ్యాపారాలున్నాయి. దీనిలో జనగాం, మేడ్చల్ ఎమ్యెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డికి విద్యా సంస్థలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీళ్లు చెరువులు, కుంటలను ఆక్రమించి మరీ కాలేజీలు నిర్మించారంటూ వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

చెరువులు, కుంటలను ఆక్రమించి మరీ అక్రమ భవనాలు నిర్మించారనే ఆరోపణలతో వీరికి హైడ్రా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. ఇబ్బందులు పడతారని భావించి వారిద్దరికీ ఈ విద్యా సంవత్సరం వరకు గడువును ఇచ్చింది. హైడ్రా నోటీసుల ప్రకారం.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలోపు నోటీసులు ఇచ్చిన కాలేజీలలో అడ్మిషన్లు ఉండకూడదు. వీళ్లు హైడ్రా నోటీసులకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లినా కూడా ఊరట దక్కలేదు.

అందుకే ఈలోపు ఎప్పటిలాగే సీట్ల కన్వర్షన్‌ పేరు చెప్పి .. సొమ్ము చేసుకోవడానికి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్లాన్ చేశారన్న వార్తలు వినిపించాయి. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో అయినా విద్యార్థులు టాప్ ప్రయారిటీ ఇచ్చేది కంప్యూటర్ సైన్స్‌కే. యాజమాన్య కోటాలో సీటు సంపాదించుకోవడానికి సుమారు 7 నుంచి 8 లక్షల వరకు ఖర్చు పెడతారు.కానీ మిగతా కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు పెద్దగా ఇష్టపడటం లేదు.

ఇక్కడే పై యాజమాన్యాలు కన్వర్షన్ పేరుతో పెద్ద ప్లాన్ వేశాయన్న టాక్ నడుస్తోంది. వేరే గ్రూపుల్లో మిగిలిపోయిన సీట్లను కన్వెర్షన్ కింద కంప్యూటర్ కోర్సుల్లోకి మార్చేస్తున్నారు. దీని వల్ల మిగిలిన కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోతే.. కంప్యూటర్ కోర్సులో ఉన్న సీట్లకు వచ్చి చేరతారు. కంప్యూటర్ కోర్సుకున్న డిమాండ్‌తో దీనికోసం ఎన్ని లక్షల రూపాయలయినా ఖర్చు పెడతారు.

విద్యార్థుల భవిష్యత్తు, కోర్సుల డిమాండ్ వల్ల జేఎన్టీయూ, ఏఐసీటీఈ, తెలంగాణ ప్రభుత్వం అనుమతి లాంఛనమే అవుతుంది. గతంలో అధికార పార్టీ ఉండబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్వర్షన్ పద్ధతికి రెడ్ సిగ్నల్ వేసేసింది. దీంతో ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతి ఇచ్చాక కూడా తెలంగాణ ప్రభుత్వం అడ్డు జెప్పడం ఏంటని యాజమాన్యాలు కోర్టులో పిటిషన్ వేశాయి. అయితే దీనిపై రేవంత్ర ప్రభుత్వ వాదనను విన్న కోర్టు సంతృప్తి వ్యక్తం చేసి.. సీట్ల కన్వర్షన్ కుదరదని చెప్పేయడంతో వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.