టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు

TSPSC Question Paper Leak Case SIT Serves Notices Again To Telangana BJP Chief Bandi Sanjay,TSPSC Question Paper Leak Case,SIT Serves Notices Again To Bandi Sanjay,Telangana BJP Chief Bandi Sanjay,Bandi Sanjay Notices on TSPSC Question Paper Leak,Mango News,Mango News Telugu,TSPSC Leak Issue,SIT issues Fresh Notice To T'gana BJP Chief,Bandi Sanjay Served Fresh Summons,TSPSC Paper Leakage Case,SIT in TSPSC Paper Leak Case,TSPSC Examinations Latest Updates,TSPSC Recruitment Latest Updates,BJP Chief Bandi Sanjay News Today,Chairman Janardhan Reddy Latest News

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసుకి సంబంధించి ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా ఇప్పటికే 20 మందికి పైగా అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రం లీకేజీపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం బండి సంజయ్‌ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా మూడు రోజుల క్రితం తొలిసారి ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నమ్మలేని నిజాలున్నాయన్న ఆయన ఆరోపణలపై వివరాలు సమర్పించాలని, అందుకు ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్.. ప్రభుత్వ వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు హాజరుకాలేదు.

అంతకుముందు ఆయన ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్‌-1లో బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారని, ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. అలాగే ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని, దీనికి మంత్రి కేటీఆరే బాధ్యులని కూడా బండి సంజయ్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు రావాలని కోరుతూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈరోజు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇందిరాపార్క్ వద్ద చేపడుతుండటం గమనార్హం. గతంలో నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని, సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =