నేడు ‘అంతర్జాతీయ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం’.. గజ్వేల్‌లో ‘రుతు ప్రేమ’ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి హ‌రీష్ రావు

Minister Harish Rao Launches Ruthuchakram Cups Distribution at Gajwel on International Menstrual Hygiene Day, Telangana Minister Harish Rao Launches Ruthuchakram Cups Distribution at Gajwel on International Menstrual Hygiene Day, Minister Harish Rao inaugurate Ruthuchakram Cups Distribution at Gajwel on International Menstrual Hygiene Day, Telangana Minister Harish Rao inaugurated Ruthuchakram Cups Distribution at Gajwel on International Menstrual Hygiene Day, Harish Rao Launches Ruthuchakram Cups Distribution at Gajwel, Ruthuchakram Cups Distribution at Gajwel, International Menstrual Hygiene Day, Telangana Minister Harish Rao Minister Harish Rao, Telangana Finance Minister Harish Rao, Finance Minister Harish Rao, Harish Rao Telangana Finance Minister, Harish Rao, Ruthuchakram Cups Distribution News, Ruthuchakram Cups Distribution Latest News, Ruthuchakram Cups Distribution Latest Updates, Ruthuchakram Cups Distribution Live Updates, Mango News, Mango News Telugu,

నేడు ‘అంతర్జాతీయ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం’ సందర్భంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో ‘రుతు ప్రేమ’ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, రుతుక్రమాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రుతు ప్రేమ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. మీ మహిళంలందరికీ ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, శాస్త్రీయమైన రుతుచక్రంపై అవగాహన కల్పించేందుకే ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.

ప్రతి మహిళకు పీరియడ్స్ రావడం సహజమని, అయితే గతంలో కుటుంబ సభ్యులతో కూడా వాటి గురించి చర్చించేందుకు సిగ్గుపడేవారని మంత్రి గుర్తుచేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చ జరగకపోవడం సమాజంలో అనేక సమస్యలను సృష్టించింది. కానీ చాలా మంది మహిళలు నేడు ప్రకృతి సహజంగా స్త్రీల శరీరంలో జరిగే ఈ అనియంత్రిత చర్యపై నిర్భయంగా చర్చించడానికి ముందుకు రావడం, అలాగే మంత్రిగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా కూడా ఈ సమస్యపై స్పందించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రుతుప్రేమ లేకపోతే సృష్టిలో జీవనమే లేదని, మానవ మనుగడను శాసించేది రుతుచ‌క్ర‌మే అని హరీష్ రావు స్పష్టం చేశారు.

మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో రుతు ప్రేమ దేశానికే ఆదర్శంగా నిలవాలని, రసాయనాలతో ముంచిన డైపర్లు మహిళల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెప్తున్నారని మంత్రి హెచ్చరించారు. క్లాత్ డైపర్లు సురక్షితంగా ఉంటాయని, కావున మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. గతంలో సిద్దిపేట మున్సిపాలిటీలోని సుమారు 3 వేల మంది మహిళలకు శానిటరీ కప్పులు, ప్యాడ్లు, క్లాత్ డైపర్లను పంపిణీ చేశామని గుర్తుచేశారు. మన సిద్ధిపేట జిల్లాలోని మహిళా పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, మహిళా గ్రామ సర్పంచ్‌లు.. ఇలా అన్ని స్థాయిల్లోని వారు కలిసికట్టుగా వస్తే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ కార్యక్రమంగా తీర్చిదిద్దగలమని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అన్ని కస్తూర్భా, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థినుల‌కు రుతుప్రేమ క‌ప్పులు ఇవ్వనున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =