హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షో సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్‌పై ఆరోపణలు రావడం, అనంతరం జరిగిన సంఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో, సినీ ప్రపంచంలో కలకలం రేపాయి.
అల్లు అర్జున్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన డిసెంబర్ 5న అరెస్ట్ అయ్యారు. ఆ రాత్రి జైలులో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఘటనపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి, పూర్తి వివరాలు వెల్లడించారు. అనంతరం అల్లు అర్జున్ కూడ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అయితే రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని ఒయూ జేఏసీ (OU JAC) నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడంతో ఇష్యూ మరింత బర్నింగ్ గా మారింది. రాళ్లతో, టమాటాలతో ఇంటిపై దాడి చేయడంతో పాటు “అల్లు అర్జున్ డౌన్ డౌన్” అనే నినాదాలు చేశారు.
దాడి నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఆరుగురు నేతలను తీసుకెళ్లి, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇంటిపై దాడి ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు కఠిన ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేశారు.
ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై, ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం వివాదాస్పదమైంది. అధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో విష్ణుమూర్తి సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.
దాడి ఘటనల నేపథ్యంలో అల్లు అరవింద్ శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగవద్దని, అందరూ సంయమనం పాటించాలని సూచించారు. విద్యార్థి సంఘాల నిరసన సమయంలో ఇంటిపై రాళ్లు రువ్వడం, పూల కుండీలు ధ్వంసం చేయడం తీవ్రంగా కలిచివేసింది.
ఇక హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బౌన్సర్లకు, ప్రైవేట్ బాడీ గార్డులకు హెచ్చరికలు జారీ చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బౌన్సర్లను నియమిస్తున్న ఏజెన్సీలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సామాన్య ప్రజలపై దాడులు, బెదిరింపులు చేస్తే జైలుకి పంపించేందుకు వెనుకాడమని హెచ్చరించారు.
తెలంగాణ పోలీస్ శాఖ కూడా సోషల్ మీడియాలో బౌన్సర్ల, ప్రైవేట్ బాడీ గార్డుల దుర్వినియోగంపై హెచ్చరికలు పోస్ట్ చేసింది. చట్టానికి వ్యతిరేకంగా దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతో జైలు శిక్ష తప్పదని పేర్కొంది.
ఈ మొత్తం సంఘటనలు రాష్ట్ర రాజకీయాలు, పోలీసు వ్యవస్థలో మరింత దృష్టి సారించడానికి కారణమయ్యాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు, ప్రభుత్వం స్పందన ప్రజలకు విశ్వాసాన్ని నూరిపోశాయి.
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024
బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలను హెచ్చరించిన హైదరాబాద్ సీపీ @CPHydCity
సామాన్యప్రజలపై దాడులు సహించబోము. బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. @CVAnandIPS #TelanganaPolice pic.twitter.com/mfor76UYii— Telangana Police (@TelanganaCOPs) December 22, 2024