నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్ట్ కోసం రూ.1,571 కోట్ల నిధులు కేటాయింపు

Telangana Govt Sanctioned Rs 1571 Crores towards NIMS Expansion Project,Telangana Govt NIMS Expansion Project,NIMS Expansion Project,Rs 1571 Crores To NIMS Expansion,Mango News,Mango News Telugu,NIMS Expansion Project News And Live Updates,NIMS Latest News And Updates,Nizam's Institute Of Medical Sciences,Nizam's Institute Of Medical Sciences News,NIMS Hospital,NIMS Hospital Expansion,NIMS Hospital 2023

వైద్యరంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టు కోసం రూ.1,571 కోట్ల నిధుల‌ను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ముందుగా నిమ్స్ డైరెక్టర్ నిమ్స్ విస్తరణ కోసం అంచనాలు, డీపీఆర్ మరియు వార్షిక ఖాతా స్టేట్‌మెంట్‌తో కూడిన ప్రతిపాదనను సమర్పించి, ఇందుకోసం కోసం రూ.1.571 కోట్ల మొత్తానికి పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను నిశితంగా పరిశీలించిన తర్వాత “నిమ్స్ విస్తరణ ప్రాజెక్ట్’ కోసం రూ.1,571.00 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతిని మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే నిమ్స్ విస్తరణ పనులు రోడ్లు మరియు భవనాల శాఖకు అప్పగించబడ్డాయని చెప్పారు.

ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేస్తూ, “ఆరోగ్య తెలంగాణ వైపు మరో పెద్ద అడుగు పడింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.1,571 కోట్లను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది మరియు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని భావిస్తుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =