గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు దేశ,విదేశాల్లో సత్తా చాటుతున్నాయి. ఇక్కడి కథలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు మన మేకర్స్. అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులతో విజువల్ వండర్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాలు ప్రేక్షకులకు థియేటర్లలో అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నాయి. అందుకే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణే కాకుండా అవార్డులు సైతం లభిస్తుంటాయి. దీనికి తాజా ఉదాహరణే.. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 2014 నుండి 2024 వరకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (మొదటి ఉత్తమ, రెండవ ఉత్తమ, మూడవ ఉత్తమ) విభాగంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా జ్యూరీ, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన, ప్రేక్షకులు మెచ్చిన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఇవే..!
- 2015 – రుద్రమ దేవి (ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్)
- 2017 – బాహుబలి – 2 ది కంక్లూజన్ (ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్)
- 2021 – ఆర్ఆర్ఆర్ (ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్)
- 2022 – కార్తికేయ 2 (సెకండ్ బెస్ట్ ఫిల్మ్)
- 2023 – హనుమాన్ (సెకండ్ బెస్ట్ ఫిల్మ్)