బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, జారీ చేసిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
కండిషన్ల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న ఏజీ వాదనలను హైకోర్టు సమర్ధించింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తుందంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంధీ తన వాదనలు వినిపించారు. అయితే ఆయన వాదనలను హై కోర్టు విభేదించింది. ఈ సందర్భంగా కమిషన్‌ను రద్దు చేయాలంటూ గులాబీ బాస్ కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ జూలకంటి అనిల్ ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను కమిషన్ స్టడీ చేస్తుంది.
ఎలక్ట్రిక్ డిపార్టుమెంటులోని కొంతమంది అధికారులకు, రిటైర్డ్ ఆఫీసర్లకు నోటీసులను జారీ చేసింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు కూడా ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేశారు. చివరగా జూన్ 27వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని అందులో తెలియజేశారు. దీంతో కమిషన్ ఏర్పాటును ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఎలక్ట్రిక్ డిపార్టుమెంట్ సెక్రెటరీ జీవో ఇవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం చెల్లదని, తనకు జారీ చేసిన నోటీసులను కేన్సిల్ చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ