మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Says It Hub Will Be Started Soon In Nizamabad By Minister Ktr,MLC Kavitha,MLC Kavitha Says On It Hub,It Hub Will Be Started Soon In Nizamabad,Mango News,Mango News Telugu,Nizamabad It Hub To Provide Employment,Kavitha Directs Officials,Kalavakuntla Kavitha News,Telangana Latest News And Updates,Telangana News,Telangana News Today

నిజామాబాద్‌లో రూ. 50 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం నిజామాబాద్‌లో పర్యటించిన ఆమె, మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఐటీ హబ్‌ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్‌ గుప్తా తదితరులు ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు. ఈ క్రమంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో ఏర్పాటు చేస్తున్న వివిధ మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు.

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్ ఇప్పటికే అద్భుత ప్రగతి సాధించినందున, ఇకపై ఐటీ కంపెనీలను ద్వితీయ శ్రేణి నగరాలలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. దీనిలో భాగంగానే నిజామాబాద్‌లో ఐటీ హబ్ నిర్మాణం జరుపుకుంటోందని పేర్కొన్న కవిత, దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక అతి త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నామని, స్థానిక డిగ్రీ కాలేజీలతో ఒప్పందాలు పెట్టుకోవడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఐటీ హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 15 =