గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ దృష్టి, ఇన్‌చార్జిగా భూపేందర్‌ యాదవ్‌ నియామకం

Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, coronavirus india, Covid-19 in India, India Coronavirus, India Covid-19 Updates, Mango News Telugu, New Confirmed Corona Cases, total corona cases in india today, total corona positive in india

ఇటీవల దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో ఇక త్వరలో జరగనునున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ మేరకు పలువురు జాతీయనేతలతో బీజేపీ అధిష్టానం ఒక కమిటీ వేసింది. జీహెఛ్ఎంసీ ఎన్నికలకు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌ను నియమించింది. అలాగే కర్ణాటక మంత్రి కె. సుధాకర్, మహారాష్ట్ర బీజేపీ నాయకుడు ఆశిష్ షెలార్, గుజరాత్ బీజేపీ నాయకుడు ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలు భూపేందర్ యాదవ్ తో కలిసి జీహెఛ్ఎంసీ ఎన్నికలకు ఇన్‌ఛార్జిలుగా పనిచేయనున్నారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, కన్వీనర్‌గా కే.లక్ష్మణ్‌, కో కన్వీనర్లుగా గరికపాటి మోహన్‌రావు, వివేక్‌లను బీజేపీ నియమించింది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్‌చార్జిగా పనిచేసి, బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన భూపేందర్ యాదవ్ ను జీహెఛ్ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా రంగంలోకి దించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ