ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌

BJP MLA Raja Singh Gets Judicial Remand for 14 Days, Hyderabad BJP MLA Raja Singh Gets Judicial Remand for 14 Days, Raja Singh Gets Judicial Remand for 14 Days, BJP MLA Raja Singh Arrested, Alleged Derogatory Remarks, MLA Raja Singh Derogatory Remarks, Derogatory Remarks, BJP MLA Raja Singh, MLA Raja Singh, BJP MLA Raja Singh Arrest News, BJP MLA Raja Singh Arrest Latest News And Updates, BJP MLA Raja Singh Arrest Live Updates, Mango News, Mango News Telugu,

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజాసింగ్​ ను వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం, సాయంత్రం హైదరాబాద్​ లోని నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టు రాజాసింగ్‌ కు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రాజాసింగ్‌ ను చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.

కాగా రాజాసింగ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఉద్రిక్తత నెలకుంది. రాజాసింగ్‌ కు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఆందోళన చేపట్టడంతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పరిస్థితులు అదుపుతప్పకుండా ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి, ఆందోళనకారులను చెదరగొట్టారు. నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్ వెళ్లే దారుల‌తో పాటుగా చంచల్‌గూడ జైలు వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY