రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Congress Chief Sonia Gandhi Meets President Droupadi Murmu at Rashtrapati Bhavan Today, INC Chief Sonia Gandhi Meets President Droupadi Murmu at Rashtrapati Bhavan Today, Sonia Gandhi Meets President Droupadi Murmu at Rashtrapati Bhavan Today, President Droupadi Murmu, Congress Chief Sonia Gandhi, Sonia Gandhi, Rashtrapati Bhavan, Droupadi Murmu, Congress Chief, Sonia Gandhi News, Sonia Gandhi Latest News And Updates, Sonia Gandhi Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్ముతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. కాగా ఇటీవలే సోనియా గాంధీ రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆమె అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. అయితే ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ద్రౌపది ముర్ము దేశంలో రెండవ మహిళ మరియు మొదటి గిరిజన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ‘భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలిశారు’ అని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయనను శాంతింపజేసేందుకు హిమాచల్ ప్రదేశ్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లాను పంపారు. ఆనంద్ శర్మతో భేటీ అనంతరం శుక్లా సోనియా గాంధీని కలవనున్నారు. ఇక మరోవైపు ద్రవ్యోల్బణంపై 22 నగరాల్లో ఆగస్ట్ 29న కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశాలు నిర్వహించి ‘ఢిల్లీ చలో’ నినాదాన్ని ఇవ్వనుంది. అలాగే సెప్టెంబర్ 5న ‘భారత్ జోడో యాత్ర’ కోసం కాంగ్రెస్ పార్టీ 32 నగరాల్లో విలేకరుల సమావేశాలను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here