హైద‌రాబాద్‌ కు రానున్న బాష్ సంస్థ, దాదాపు 3000 మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్

Bosch Global Software Technologies to Set up Facility in Hyderabad - Minister KTR

హైద‌రాబాద్‌ మహానగరంలో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ ఏర్పాటు కానుంది. జర్మనీకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ, మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు కానుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాష్ సంస్థ తన గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సెంటర్ మరియు ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను వ్యూహాత్మక ప్రదేశంగా ఎంచుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రతిపాదిత కేంద్రాల ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ