దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 170 కోట్లు దాటింది. ఫిబ్రవరి 8, మంగళవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 170 కోట్లు ((1,70,21,72,615) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటికి మొత్తం 1,89,63,092 సెషన్ల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కాగా గత 24 గంటల్లోనే 55.78 లక్షలమందికి పైగా (55,78,297) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (ఫిబ్రవరి 8, ఉదయం 7 గంటల వరకు):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,03,98,100
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 99,07,584
- హెల్త్ కేర్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 37,00,573
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,84,02,343
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,73,29,337
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 48,84,424
- 15-18 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 4,99,87,314
- 15-18 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 75,90,456
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 54,55,09,057
- 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 41,79,67,945
- 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 20,11,27,430
- 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 17,44,55,783
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 12,54,87,208
- 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు) : 10,86,83,344
- 60 ఏళ్లు పైబడినవారు (ప్రికాషన్ డోసు) : 67,41,717
- మొత్తం ప్రికాషన్ డోసుల పంపిణీ : 1,53,26,714
- పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,70,21,72,615
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ