
ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల సిత్రాలు చూస్తుంటాం. మిత్రులు శత్రువులురాజనర్సింహ అవుతారు.. శత్రువులు అలయ్ బలయ్ అని ఆప్యాయంగా పలకరించుకుంటారు. నిన్నమొన్నటి వరకూ ఒక లెక్క ఎన్నికలు వచ్చేముందు ఒక లెక్క అన్నట్లుగా పొలిటికల్ సినారియోలు మారిపోతూ ఉంటాయి. ఒక కుటుంబంలోనే ప్రత్యర్థులుగా మారి ఎన్నికల బరిలో దిగేవాళ్లూ ఉంటారు. అలా రెండు వేర్వేరు ప్రధాన పార్టీల నుంచి సొంత అన్నదమ్ములు .. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో వేరు వేరు నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న ఇద్దరు అన్నదమ్ముల గురించి తాజాగా నెట్టింట్లో చర్చ జరుగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సిలారపు దామోదర , సిలారపు రాంచందర్ అన్నదమ్ములన్న విషయం చాలామందికి తెలియదు . వీరి తండ్రి సిలారపు రాజనరసింహ కూడా పొలిటికల్ లీడరే.ఆయన ఆందోల్ ఎమ్మెల్యేగా 1967, 1972, 1978లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
ఇక దామోదర రాజనర్సింహ గురించి చెప్పాలంటే ఆయన.. 1989, 2004, 2009లో మూడుసార్లు గెలుపొందారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రి గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున తరపున ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు
దామోదర రాజనర్సింహ సోదరుడు.. రాంచందర్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లోకి అడుగుపెట్టారు. రాంచందర్ జహీరాబాద్ నుంచి పోటీకి దిగుతున్నారు. వేర్వేరు పార్టీలతో, వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఈ అన్నదమ్ములు ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నిలబడటం అటు బంధువర్గం నుంచే కాకుండా .. తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE