దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ రేపే ప్రారంభం

Durgam Cheruvu Bridge, durgam cheruvu bridge inauguration, Durgam Cheruvu Bridge News, Durgam Cheruvu Cable Bridge, durgam cheruvu cable bridge inauguration, Durgam Cheruvu Cable Bridge News, Durgam Cheruvu Cable Bridge Opening, Durgam Cheruvu Cable Bridge Updates, Four Lane Elevated Corridor

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని, అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ను సెప్టెంబర్ 25, సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

కేబుల్ బ్రిడ్జి నిర్మాణ వివరాలు:

  • టోటల్ లెన్త్: 735.639 మీటర్లు
  • ఎక్స్ట్రాదోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి లెన్త్: 425.8 మీటర్లు
  • వ్యయం: రూ.184 కోట్లు
  • కాంట్రాక్టర్: ఎల్ అండ్ టీ

రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్:

  • టోటల్ ఫ్లైఓవర్ లెన్త్: 1700.00 మీటర్లు
  • వ్యయం: రూ.150 కోట్లు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + one =