పర్యాటక శాఖపై మనసు పారేసుకున్న మంత్రి

KTR Wants Tourism Department not it,KTR Wants Tourism Department,Tourism Department not it,This time I will seek tourism portfolio,BRS, KTR,BNI, minister,tourism department,IT Minister Ktr,Cm Kcr,BRS, Hyderabad,Telengana,Mango News,Mango News Telugu,Tourism Department Latest News,Tourism Department Latest Updates,Tourism Department Live News,BRS Latest News,BRS Latest Updates
BRS, KTR,BNI, minister,tourism department,IT Minister Ktr,Cm Kcr,BRS, Hyderabad, Telengana

మంత్రి కేటీఆర్‌ను.. బీఆర్ఎస్ నేతలే కాదు.. తెలంగాణవాసుల్లో చాలామంది  ఫ్యూచర్ ముఖ్యమంత్రిగానే అనుకుంటారు. అందుకే వీలయినప్పుడల్లా  బీఆర్ఎస్ వర్గాలు కేటీఆర్‌ను కాబోయే సీఎం అనే ప్రజెంట్ చేస్తుంటారు. కానీ  ఆయన  మాత్రం తాజాగా.. తాను వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉంటానని ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి అవ్వాలని మనసులోని కోరిక బయట పెడతారేమోనని అనుకుంటున్నవాళ్లంతా.. కేటీఆర్ టూరిజం మంత్రి అవుతానంటున్నారేంటని షాక్ అయ్యారు.

శుక్రవారం ఐటీసీ కాకతీయలో జరిగిన  బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ సదస్సులో మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఈసారి  బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, తెలంగాణలో సామాజిక, మౌలిక వసతులపై తాను దృష్టి పెడతామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పర్యాటక శాఖపై ఎక్కువ ఫోకస్ పెడతామనని.. తాను వచ్చే ఐదేళ్లూ పర్యాటక శాఖ మంత్రిగా ఉంటానని చెప్పడం హాట్ టాపిక్ అయింది.

తెలంగాణలో ఐటీ రంగం బాగానే డెవలప్ అయిందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు.   దీనికితోడు ఐటీ మంత్రిగా కేటీఆర్ చేసిన కృషి తోడవడంతో..ఇప్పుడు హైదరాబాద్‌  ఒకటే కాదు.. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో ఐటీ కంపెనీల ఆఫీసులు వెలుస్తున్నాయి. దీంతో ఐటీ రంగం నుంచి ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తోంది..ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలూ బాగానే పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో  టూరిజం శాఖపైన కూడా తెలంగాణ ప్రభుత్వం బాగానే ఫోకస్ పెడుతోంది. జిల్లాల వారీగా ఉన్న చెరువులు, పార్కులు, దేవాలయాలతో పాటు, అడవులను కూడా అభివృద్ధి చేస్తోంది.  దీని ద్వారా పర్యాటక రంగం కూడా బాగా అభివృద్ధి చెందినట్లే అయింది. ఐతే.. విదేశీయుల్ని మరింతగా ఆకట్టుకోవాలంటే ఈ డెవలప్మెంట్ సరిపోదని కేటీఆర్ భావిస్తున్నారట.

ఇండియాకు వచ్చే పర్యాటకులు హైదరాబాద్ చూడకుండా తిరిగి వెళ్లరు. దీనికి తోడు తెలంగాణలో ప్రాచుర్యం పొందిన కొన్ని ప్రదేశాలను కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.  తెలంగాణ సర్కార్ ఇచ్చే టూరిజం ప్యాకేజీల ఆధారంగా ఇతర జిల్లాల్లో ఆలయాలు, చారిత్రక కట్టడాలను చూడటానికి వెళ్తున్నారు. కానీ ఇలా వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. విదేశీ పర్యాటకుల్ని భారీ సంఖ్యలో రాబట్టగలిగితే.. కేరళలాగే తెలంగాణలోని టూరిజం శాఖ నుంచి ప్రభుత్వానికి కొన్ని వందల రెట్లు ఆదాయం పెరుగుతుంది. దీంతోనే కేటీఆర్ ఈ రంగంపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఐటీ మంత్రిగా  కేటీఆర్‌కు రావాల్సిన గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడో వచ్చింది. దీనికి తోడు ఐటీలో చేసిన అభివృద్ధి అంతర్గతంగానే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ టూరిజం శాఖలో అయితే.. కొత్తగా నిర్మించే పార్కులు కానీ, ఆలయాలు కానీ, నిర్మాణాలు కానీ  అన్నీ కూడా కళ్లముందు కనిపిస్తాయి. దీంతో బావితరాలకు తాము చేసిన డెవలప్మెంట్ ఎన్నేళ్లు గడిచినా కనిపిస్తూనే ఉంటుంది. దీనికితోడు తెలంగాణలో టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో టూరిజం అభివృద్ధి చేస్తే ఆదాయంతో పాటు..ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని దీనివల్ల తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతుందని కేటీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఎన్నికలలో బీఆర్ఎస్ గెలవడానికి ఈ అంశం కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =