
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను.. కేటీఆర్ ఎంత డైనమిక్‌గా నిర్వహించారో అందరికీ తెలుసు. ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లే తాజా అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి తెలంగాణలో ఐటీ ఈ స్థాయిలో డెవలప్ అయిందంటే..దానికి మాజీ ఐటీ మంత్రి కేటీఆరే కారణం అని ఎవరిని అడిగినా చెబుతారు. ఐటీ అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటే ఐటీ అన్నంతగా అందరిలో ఆయన ముద్ర వేసుకున్నారు.
అంతెందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా పెద్దగా పట్టించుకోని వారంతా.. ఐటీ మంత్రిగా ఇక కేటీఆర్ ఉండరన్న నిజాన్ని మాత్రం జీర్ణించుకులేకపోయారు. సోషల్ మీడియాలో మాకు మళ్లీ ఐటీ మంత్రిగా కేటీఆర్ కావాలంటూ ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ కేటీఆర్ పట్ల ఐటీ ఉద్యోగులు ఎంత మమకారాన్ని పెంచుకున్నారో అర్ధం అయేలా చేసింది. ఇప్పుడు ఐటీ శాఖను దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కేటాయించడంతో ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం, ప్రతీ యాక్షన్‌ను యూత్ కేటీఆర్‌తో పోల్చడం ఖాయం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్తగా ఐటీ శాఖను తీసుకోవడం కాదు.. కేటీఆర్ రేంజ్‌లో ఆ శాఖను నిర్వహించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల యూత్ అసంతృప్తికి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో.. ఐటీ మంత్రిగా ముందుగా కోమటిరెడ్డి పేరు, ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు వినిపించినా.. తర్వాత దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆ శాఖను ఖరారు చేశారు. మదన్ మోహన్ రావుకు హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం.. ఇంగ్లీష్‌లో పట్టు ఉండటంతో మదన్ మోహన్ ఐటీ మంత్రిగా చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ మళ్లీ లెక్కలు మార్చిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఆ శాఖను శ్రీధర్ బాబుకు కేటాయించింది.
అయితే ఇప్పుడు ఐటీ మంత్రిని ఎవరిని తీసుకువచ్చినా కేటీఆర్ స్థానాన్ని భర్తీ చేయడం కానీ, ఆయన ఇమేజ్‌ను కనీసం టచ్ చేయడం కూడా ఎవరి వల్ల కాదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణకు గుండెకాయగా చెప్పుకునే హైదరాబాద్‌లో ఐటీ శాఖ అత్యంత కీలకమైనదన్న విషయం తెలిసిందే. నిజానికి కేటీఆర్ ఐటీ మంత్రిగా వచ్చాకే ప్రపంచ దేశాలలో అన్ని ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. ఇంకా చెప్పాలంటే అగ్రదేశాలు,సంపన్నదేశాలు కూడా హైదరాబాద్ ఐటీ రంగంలో జరిగిన మార్పులు చూసి విస్తుపోయారు. అందుకే ఇదంతా కేటీఆర్ వల్లే జరిగిందనే విషయాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒప్పుకుని తీరాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్‌లో వచ్చిన శ్రీధర్ బాబు.. ఐటీ మంత్రిగా కేటీఆర్ చూపించిన ప్రతిభను చూపించగలరా? చేయగలరా అనే డౌట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY