శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs elected the leader of the legislative party,BRS MLAs elected the leader,leader of the legislative party,BRS, BRSLP, KTR, Telangana Politics,Mango News,Mango News Telugu, legislative party,BRS MLAs elected,BRS MLAs Latest News,BRS MLAs Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
BRS, BRSLP, KTR, Telangana Politics

తెలంగాణలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఇటీవల జరిగిన ఎన్నికలతో గద్దెదిగిపోయింది. అటు అధికారపీఠం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న కాంగ్రెస్.. తాజా ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి అధికారాన్ని చేజిక్కించుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష పార్టీగా హోదా దక్కింది. ఈక్రమంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అటు కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించే ప్రసక్తే లేదని.. ఆసలు ఆయన అసెంబ్లీలోనే అడుగుపెట్టరని చర్చ జరిగింది.

అదే సమయంలో కేసీఆర్‌కు తీవ్ర గాయమయింది. తన ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ కాలుజారి కిందపడిపోవడంతో.. ఆయన తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కేసీఆర్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈక్రమంలో కేసీఆర్ ఆసుపత్రిలో ఉండడంతో.. శనివారం అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. అదే సమయంలో శాసనభాపక్ష నేతగా కేటీఆర్‌ను ఎన్నుకోనున్నారని కొత్త చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ మరో 8 వారాల పాటు బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో.. శాసనభాపక్ష నేతగా కేటీఆర్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి.

ఈ క్రమంలో బీఆర్ఎస్ శాసనసాభాపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటారనేది ఉత్కంఠకరంగా మారింది. అయితే శనివారం ఈ ఉత్కంఠకు తెరదింపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతను  ఎన్నుకున్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =