కులగణన ఎట్టిపరిస్థితుల్లో ఆగదు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన కులగణపై మాట్లాడారు. కులగణను ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు మంత్రి పొన్నం. ప్రతి 150 ఇళ్లకీ ఒక ఎన్యూమరేటర్ ఉండడం ద్వారా, కులగణన ప్రక్రియను సులభతరం చేయడం జరుగుతుందని చెప్పారు. కులగణన ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా కదిలించాలని అన్నారు. అందుకని, కులగణనను సమర్ధవంతంగా పూర్తి చేయడం మన బాధ్యత అని ఆయన వివరించారు.

ఇక స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను ఖచ్చితంగా అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని పొన్నం తెలిపారు. అందరి ఏకాభిప్రాయంతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎలాంటి బేషణాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.