తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి తరగతులు, మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు

Mango News, Secondary School Certificate, telangana 10th exams, Telangana SSC Examinations, Telangana SSC Examinations Begin From May 17th 2021, Telangana SSC Time Table, Telangana SSC Time Table 2021, TS 10th Class Exam, TS 10th Class Exam Dates, TS 10th Class Exam latest news, TS 10th Class Exam news, TS 10th Class Exams, TS SSC Exam

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కార్యకలాపాల షెడ్యూల్ (అకడమిక్ క్యాలెండర్)‌ పై శనివారం నాడు రాష్ట్ర విద్యాశాఖ స్పెష‌ల్ చీఫ్‌ సెక్ర‌ట‌రీ చిత్రా రాంచంద్ర‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. పాఠశాలలకు హాజరవ్వడం తప్పనిసరి కాదని, హాజరయ్యే విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుండి తప్పనిసరిగా రాతపూర్వక అనుమతి పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం పరీక్షలు రాసేందుకు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోమని, హాజరు సరిపడా లేకపోయినా కూడా విద్యార్థుల‌ను ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తామని వెల్లడించారు.

9, 10 వ తరగతి విద్యార్థులకు ఉద‌యం 9:30 గంట‌ల నుంచి సాయంత్రం 4:45 గంట‌ల వ‌ర‌కు తరగతులు జరుగుతాయని చెప్పారు. ఇక హైద‌రాబాద్ పరిధిలో ఉద‌యం 8:45 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పాఠశాలలు నడవనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 1, 2020 నుంచి జనవరి 30, 2021 వరకు 115 రోజుల ఆన్‌లైన్ బోధన, ఫిబ్రవరి 1 నుంచి 89 రోజుల పాటుగా పేస్ టు పేస్ (ఆఫ్ లైన్, ఆన్‌లైన్) కలిపి 2020-21 విద్యాసంవత్సరంలో మొత్తం 204 పనిదినాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

పాఠశాలల అకడమిక్ క్యాలెండర్:

  • ప్రారంభతేది: ఫిబ్రవరి 1 (9,10 విద్యార్థులకు)
  • చివరి పనిదినం: మే 26
  • వేసవి సెలవులు: మే 27 నుంచి జూన్ 13
  • సిలబస్: 30 శాతం ప్రాజెక్టు వర్క్స్, అసైన్ మెంట్స్, 70 శాతం పాఠశాల్లో, ఆన్ లైన్ లో బోధన

పరీక్షల షెడ్యూల్:

  • ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌-1 : మార్చి 15 లోగా
  • ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌-2 : ఏప్రిల్ 15 లోగా
  • సమ్మెటివ్ అసెస్‌మెంట్‌ : మే 7-మే 13
  • పదో తరగతి పరీక్షలు : మే 17-మే 26
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 9 =