ఏపీకి 302 మంది డీఎస్పీలు, తెలంగాణకు 192 మంది డీఎస్పీలు కేటాయింపు

Allocation of Non-Cadre Officials, Allocation of Non-Cadre Officials Between Telangana Andhra Pradesh, Andhra Pradesh, Centre Completes the Allocation of Non-Cadre Officials, Non-Cadre Officials Between Telangana, Non-Cadre Officials Between Telangana Andhra Pradesh, telangana, Telangana Centre allocates Home posts between TS AP

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పోలీస్ అధికారుల కేటాయింపు ఎట్టకేలకు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు పోలీసు అధికారుల తుది కేటాయింపుపై కేంద్ర హోమ్ శాఖ బుధవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నాన్‌ కేడర్‌ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలను 52:48 నిష్పత్తిలో కేటాయింపులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు 16 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీలు, 64 మంది అడిషనల్ ఎస్పీలు, 302 మంది డీఎస్పీలను, తెలంగాణ రాష్ట్రానికి 9 మంది నాన్‌కేడర్‌ ఎస్పీలు, 49 మంది అడిషనల్ ఎస్పీలు, 192 మంది డీఎస్పీలను కేంద్రం కేటాయించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu