ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త, ధరలు తగ్గింపు

Allocation of Non-Cadre Officials, Allocation of Non-Cadre Officials Between Telangana Andhra Pradesh, Andhra Pradesh, Centre Completes the Allocation of Non-Cadre Officials, Non-Cadre Officials Between Telangana, Non-Cadre Officials Between Telangana Andhra Pradesh, telangana, Telangana Centre allocates Home posts between TS AP

ఏపీలో మ‌ద్యంప్రియుల‌కు తాజాగా శుభవార్త‌ అందింది. మద్యం ధరల్ని తగ్గిస్తూ గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో తయారయ్యే విదేశీ మద్యం(ఐఎమ్ఎఫ్ లిక్క‌ర్‌), ఫారిన్ లిక్క‌ర్ మ‌ధ్య‌, ఉన్న‌త శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధ‌ర‌ల‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీల మద్యం బ్రాండ్లపై రూ. 50 నుంచి రూ.1350 వరకు ధరలను త‌గ్గించారు. అయితే బీర్లు మరియు రెడీ టూ డ్రింక్స్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే వివిధ కేటగిరీల్లో రూ.200 వరకు ధర ఉన్నవాటిపై కూడా ఎలాంటి మార్పు చేయలేదు. ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం అక్ర‌మ రవాణాను నియంత్రించే చర్యల్లో భాగంగానే మద్యం ధ‌ర‌లు తగ్గిస్తునట్టుగా పేర్కొన్నారు. అక్టోబర్‌ 30 నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని అబ్కారీ శాఖ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =