రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబే నయం:మందకృష్ణ

Chandrababu Is Better Than Revanth Reddy Mandakrishna, Chandrababu Is Better Than TS CM, Aasara Pensions, Chalo Hyderabad, Chandrababu Is Better Than Revanth Reddy, CM Revanth Reddy, Indirapark, Mandakrishna, Mandakrishna Madiga, VHPS, Telangana, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంటే.. ఏపీ సీఎం చంద్రబాబే చాలా బెటర్ అన్నారు మందకృష్ణ. చేయూత పించన్ దారులను రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు మందకృష్ణ మాదిగ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి.. ఆ పార్టీని గెలిపించారని, కానీ ఇప్పుడు నమ్మిన పింఛన్ దారుల్ని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకూ పింఛన్లను ఎందుకు పెంచలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

పించన్ పంపిణీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంటే ఏపీ సీఎం చంద్రబాబు చాల బెటర్ అని ఆయన అన్నారు. ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చామని, జూన్ లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. ఏప్రిల్, మే, జూన్ నెలలవి కలిపి జూలైలో ఇచ్చారని తెలిపారు. అలాగే కండరాల క్షీణత ఉన్నవారికి ప్రతినెలా రూ.15 వేలు పింఛన్ ఇస్తున్నారని చెప్పారు.

చేయూత పింఛన్ దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని మందకృష్ణ మాదిగ వెల్లడించారు. చేయూత పింఛన్ దారులందరితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పింఛన్ దారులకు 10 నెలల బకాయిలను కలిపి ని. ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

నవంబర్ 1 నుంచి 16వ తేదీ వరకూ రోజుకు రెండు జిల్లాలో చేయూత పింఛన్ లబ్దిదారులతో చైతన్య సభలు నిర్వహిస్తామని, అప్పటిలోగా పింఛన్లు ఇవ్వని నేపథ్యంలో 26న చలా హైదరాబాద్ కు పిలుపునిస్తామన్నారు. అదే రోజున వికలాంగుల మహాగర్జన పేరుతొ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామన్నారు.