మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy, telangana cm, congress
revanth reddy, telangana cm, congress

సమయపాలన పాటించరనే విమర్శ ప్రభుత్వ ఉద్యోగులపై ఎప్పటి నుంచో ఉంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు 10 గంటలకు ఓపెన్ అయితే.. 11, 12 గంటలకు ఉద్యోగులు వస్తుంటారు. సాయంత్రం కూడా టైమ్ కాకముందే వెళ్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం వల్ల కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అంతేకాకుండా జనాలు కూడా అధికారులు ఎప్పుడు వస్తారో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా టైమ్‌కి వచ్చి.. టైమ్‌కి వెళ్లేందుకు కొత్త అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండెన్స్ కోసం రిజిస్టర్ విధానం ఉండడంతో.. అధికారులు అందులో ఇష్టం వచ్చినట్లుగా టైమ్ వేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఈక్రమంలో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని రేవంత రెడ్డి భావిస్తున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం వల్ల కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చిన సమయానికి అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. లేటుగా వచ్చి.. ముందుగా సమయం వేయాలన్నా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం వల్ల వీలు కాదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు  సమయానికి రారు.. సమయం కాకముందే వెళ్లిపోతారన్న ఆరోపణలు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ కొత్త టెండెన్స్ విధానం వల్ల ఉద్యోగులు కచ్చితంగా సమయపాలన పాటిస్తారని.. తద్వారా పనిలో కూడా వేగం పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ముందుగా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని సెక్రటేరియట్‌లోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎస్ఎస్, సెక్రటరీల నుంచి అటెండర్స్ వరకు అందరూ ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పాటించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సంబంధిత అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారట. అతిత్వరలోనే సెక్రటేరియట్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారట. మరి దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE