హైదరాబాద్ నగర శివారులలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

City Bus Services, City Bus Services Started Today, Hyderabad, Hyderabad Bus Services, Hyderabad City, Hyderabad City Bus Services, Telangana city buses, TSRTC Bus Services, TSRTC Bus Services Hyderabad, TSRTC Bus Services In Hyderabad City

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటుగా, శివారు ప్రాంతాలలో కూడా ఆర్టీసీ సిటీ బస్సులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు నెలల అనంతరం ఈ రోజు హైదరాబాద్ నగర శివార్లలోని పలు డిపోల్లోని సిటీ బస్సులు రోడ్డెక్కాయి. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ సహా ఇతర ఆర్టీసీ డిపోల నుంచి 200 కు పైగా బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల ప్రారంభంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

ఆర్టీసీ సిటీ బ‌స్సుల ప్రారంభంపై మరో మూడు రోజుల్లో అధికారులు కీలక ప్రకటన చేసే అవకాశమునట్టు తెలుస్తుంది. ఈ మేరకు కండ‌క్ట‌ర్లు, డ్రైవ‌ర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని డిపో అధికారులకు ఆర్టీసీ ఉన్న‌తాధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. కరోనా లాక్‌డౌన్ లో కేంద్రప్రభుత్వం సడలింపులు ఇచ్చాక తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే సిటీలో కరోనా వ్యాప్తి ప్రభావం ఎక్కువుగా ఉండడంతో సిటీ బస్సుల సేవలపై నిషేధం కొనసాగించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టడంతో నిబంధనలకు అనుగుణంగా సిటీ బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu