వైఎస్‌ వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో.. నేటి సాయంత్రం 4 తర్వాత సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి

Kadapa MP Avinash Reddy To Attend For CBI Enquiry Today In Ex Minister YS Viveka Assassination Case,Kadapa MP Avinash Reddy To Attend For CBI Enquiry,Avinash Reddy CBI Enquiry Today,CBI Enquiry Today In Ex Minister YS Viveka Assassination Case,Ex Minister YS Viveka Assassination Case,Mango News,Mango News Telugu,YS Avinash Reddy To Attend CBI Inquiry,Viveka Murder Case,CBI Issues Summons To MP YS Avinash Reddy,Cm Jagans Uncle Bhaskar Reddy Arrested,Y.S. Bhaskar Reddy Arrested,Avinash Alleges CBI Probe Was Targeted,Kadapa MP YS Avinash Reddy News,YS Viveka Assassination Case News Today,MP Avinash Reddy Latest News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బాబాయి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నిందితుల తరపున హైకోర్టులో రోజుకొక పిటిషన్ దాఖలవుతున్న నేపథ్యంలో కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ పులివెందులలో అరెస్ట్ చేయడం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ప్రత్యేక బ్యారక్ లో ఉన్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ సోమవారం విచారణకు రావాలని ఆదేశించగా.. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిన్నటి విచారణను సీబీఐ నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి నేడు మరోసారి సీబీఐ ఎదుట విచారణకు హాజరవనున్నారు. ఇక వాదనల సందర్భంగా.. వివేకా హత్య వెనుక కుటుంబ కలహాలు, రాజకీయ కారణాలు, ఆర్థిక లావాదేవీలు, మహిళలతో సంబంధాలు వంటి అనేక కారణాలు ఉన్నాయని ఎంపీ తరపు న్యాయవాది వాదించగా.. సీబీఐ ఈ ఆరోపణలను తిప్పికోట్టింది. కేవలం దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నామన్న వాదనలో నిజం లేదని.. వివేకా హత్య జరిగిన తర్వాత మొట్టమొదట అది గుండెపోటేనని ప్రచారం చేసింది అవినాష్ రెడ్డేనని స్పష్టం చేసింది.

అంతేకాకుండా హత్య ఘటన తర్వాత ఆయన చాలా క్రియాశీలంగా వ్యవహరించి సాక్ష్యాలను నాశ నం చేసే ప్రయత్నాలు చేపట్టారని తెలిపింది. అయితే కోర్టు సమయం ముగియడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత పిటిషనర్‌ను విచారణకు పిలవాలని సీబీఐని ఆదేశించింది. అలాగే వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌పై సైతం వాదనలు వింటామని తెలిపింది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను సీబీఐ కస్టడీకి ఇచ్చే అంశంపై మంగళవారం తీర్పు వెలువరిస్తామని హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి నేటి సాయంత్రం 4 తర్వాత సీబీఐ విచారణకు హాజరవనుండటంతో ఏం జరుగనుందో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 5 =