బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించండి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

2020-21 Budget, CM KCR Asks Officials to Conduct an Interim Review, Interim Review on the 2020-21 Budget, KCR Asks Interim Review on the 2020-21 Budget, Telangana 2020-21 Budget, Telangana Budget, Telangana CM KCR, Telangana News, Telangana Political News

కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ‘‘కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడింది. కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయింది. దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంతో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలి. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలి. మొత్తం బడ్జెట్ పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి’’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu