కొత్త పురపాలక చట్టం ఆపాలని గవర్నర్ ని కోరిన భాజపా నేతలు

BJP leaders meet Governor issue Municipal Act 19, BJP seeks Governor intervention on Municipal Act 19, Mango News, New Act violates spirit of Constitution BJP, Telangana BJP Leaders Meet Governor Over New Municipal Act, Telangana Municipal Act 19 Latest News, Telangana Municipal Act 19 passed in Assembly, Telangana Political News

మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ నేతృత్వంలో తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ ని కలిశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టగా ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం పై వినతిపత్రం అందించారు, కొత్త చట్టాన్ని పరిశీలించి, ఆపాలని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ని కోరారు. గతంలో రాజ్యాంగ పద్ధతిలో అమలవుతున్న చట్టాన్ని పక్కన పెట్టి, ఇష్టానుసారంగా కొత్త చట్టాన్ని రూపొందించారని తెలిపారు.సామాజికపరమైన అంశాలు,రవాణా సౌకర్యాలు,నిధులు,నీటి సరఫరా ఇతర ముఖ్యమైన అంశాలను పట్టించుకోకుండా,కొత్త చట్టాన్ని రూపొందించారని విమర్శించారు.

కనీసం అవసరమైన మౌలిక సదుపాయాలు లేకుండానే కొత్త కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు, మునిసిపల్ ఎన్నికలకు న్యాయస్థానం 118 రోజుల గడువు కేటాయించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోమని ఆదేశిస్తే, ఎన్నికలు త్వరగా జరపాలని ప్రభుత్వం ఎన్నికల సంఘం పై ఒత్తిడి తెస్తుందని బిజెపి నాయకులు విమర్శించారు. డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి మరియు ఇతరులు గవర్నర్ ని కలిసారు. త్వరలోనే తెరాస ప్రభుత్వం అవినీతి బయట పెడతామని డీకే అరుణ అన్నారు,ప్రభుత్వ పథకాల్లో అవినీతి పై పోరాటం చేస్తామన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=z8FoNC-6uAg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =