తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్ లోని హెచ్ఐసిసిలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ 27 బుధవారం ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులందరూ హెచ్ఐసిసి సమావేశమందిరానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం జరుగుతుందని, 11:05 గంటలకు సీఎం కేసీఆర్ ఆగమనం, అనంతరం పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఆ సందర్భంగా దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టి, వాటిపై చర్చించి ఆమోదించడం జరుగుతుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం అదే సాయంత్రం 5 గంటల దాకా కొనసాగి, ముగుస్తుందని తెలిపారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర మంత్రివర్గం, రాజ్య సభ, లోక్ సభ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటిసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు మరియు చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల మరియు మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొంటారని, అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ