ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలకనిర్ణయం, తన జీతాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం ఇస్తానని ప్రకటన

AAP Rajya Sabha MP Harbhajan Singh to Contribute His RS Salary to Daughters of Farmers for their Education, MP Harbhajan Singh to Contribute His RS Salary to Daughters of Farmers for their Education, AAP Rajya Sabha MP Harbhajan Singh, RS Salary to Daughters of Farmers for their Education, MP Harbhajan Singh to contribute his Rajya Sabha salary towards education, Former Team India Cricketer Harbhajan Singh to Contribute His RS Salary to Daughters of Farmers for their Education, Former Team India Cricketer Harbhajan Singh, Former Team India Cricketer, Cricketer Harbhajan Singh, Harbhajan Singh, Harbhajan Singh Likely to Contribute His RS Salary to Daughters of Farmers for their Education, Aam Aadmi Party, Rajya Sabha, Cricketer, AAP Party MP Harbhajan Singh Pledges Rajya Sabha Salary For Farmers Daughters, Aam Aadmi Party MP Harbhajan Singh to contribute his RS salary towards education of farmers daughters, Former cricketer and AAP MP Harbhajan Singh would contribute his Rajya Sabha salary to the daughters of farmers, Former Team India Cricketer Likely to be Nominated to Rajya Sabha By AAP, Aam Aadmi Party Latest News, Aam Aadmi Party Latest Updates, Aam Aadmi Party Live Updates, Mango News, Mango News Telugu,

టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకొచ్చే వేతనాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం అందిస్తానని తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా హర్భజన్ సింగ్ ప్రకటన చేశాడు. “ఒక రాజ్యసభ సభ్యునిగా, రైతుల కుమార్తెల విద్య మరియు సంక్షేమం కోసం నా రాజ్యసభ జీతాన్ని వారికి అందించాలనుకుంటున్నాను. మన దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడడంలో పాల్గొంటాను మరియు నేను చేయగలిగినదంతా చేస్తాను. జై హింద్” అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పంజాబ్ కు సంబంధించి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆప్‌కి మొత్తం ఐదు స్థానాలకు సరిపడా సభ్యులుండడంతో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆప్ వ్యూహకర్త సందీప్ పాఠక్‌, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్, లూథియానాకు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అనంతరం ఈ ఐదుగురు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో గత ఏడాది డిసెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీగా రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాజాగా తనవేతనాన్ని రైతుల కుమార్తెల విద్య కోసం ఉపయోగించాలని హర్భజన్ సింగ్ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =