ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనేదే ప్రభుత్వ సంకల్పం, క్రిస్మస్ గిఫ్ట్స్ అందజేసిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Distributes Gift Packets in Connection with Christmas Celebrations,Telnagana government intention,people celebrate the festivals happily, Minister Talasani presented Christmas gifts,mango news,mango news telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,TRS Party,TRS Latest News and Updates,BRS Party News and Live Updates,BRS Party Emergence,Election Commision Of India,Telangana BRS Party,TRS Party News,Emergence BRS Programe,

రాష్ట్ర ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం తరపున సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ చర్చిల ప్రతినిదులకు, పేద క్రిస్టియన్ లకు పంపిణీ చేసేందుకు క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగపూట పేదలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గిఫ్ట్ ల పంపిణీ తో పాటు గొప్ప విందు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే విందుకు సీఎం కేసీఆర్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన క్రిస్టియన్ మత పెద్దలను ఆహ్వానించడం జరుగుతుందని వివరించారు. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందులను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

చర్చిలు, గ్రేప్ యార్డ్ ల అభివృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లకే దక్కుతుందన్నారు. క్రిస్మస్ తర్వాత క్రిస్టియన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని చర్చిలు, గ్రేవ్ యార్డ్ ల అభివృద్ధి ఇతర పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. క్రిస్టియన్ లు అంటే ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని, వారి అభివృద్దికి ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో ఉప్పల్ భగాయత్ క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎంతో అద్బుతంగా భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని మంత్రి తలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =