నిధుల సమీకరణ పక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి – సీఎం కేసీఆర్

#KCR, Fundraising for Water Resource Projects, KCR Review Meeting on Water Resources Department, Telangana Water Resource Projects, Telangana Water Resources Department, Water Resource Projects

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటికి నిధుల సమీకరణ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 21, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టిఎంసిని తరలించే పనులతో పాటు, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

‘‘నీటి లభ్యత కలిగిన సమయంలో ప్రతీ రోజు గోదావరి నుంచి 4 టిఎంసిలు, కృష్ణా నుంచి 3 టిఎంసిల నీటిని తరలించి రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరుపున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధుల సమీకరణ పక్రియను పూర్తి చేయాలి. వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu