సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, కీలక చర్చలు

TSPSC Chairman Janardhan Reddy Meets CM KCR at Pragathi Bhavan Today Amid Paper Leak Issue,TSPSC Chairman Janardhan Reddy,Janardhan Reddy Meets CM KCR at Pragathi Bhavan,Amid Paper Leak Issue,Janardhan Reddy on Amid Paper Leak Issue,Mango News,Mango News Telugu,TSPSC Paper Leak Updates,Pragathi Bhavan Latest News,TSPSC Question Paper Leak Case,TSPSC Paper Leak Scam,TSPSC Examinations Latest Updates,TSPSC Recruitment Latest Updates,TSPSC Group 1 Latest Updates,Chairman Janardhan Reddy Latest News,CM KCR News And Live Updates

తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలను కమిషన్ ఛైర్మన్ వివరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణ వంటివాటిపై ఏం చేయాలనే దానిపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ భేటీలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎం కేసీఆర్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారని, ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ భేటీలో ఏం జరగనుందో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here