తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 22న యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ముందుగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. జూన్ 22న వాసాలమర్రికి వస్తున్నానని, గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలోని సమస్యలపై చర్చిద్దామని, ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆరోజున ఊరంతా కలిసి సామూహిక భోజనం చేద్దామని చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాసాలమర్రి గ్రామంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ