నేడు జనగామలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR will Inaugurate Rythu Vedika at Kodakandla, CM KCR will Inaugurate Rythu Vedika at Kodakandla Mandal, Jangaon, Kodakandla, Rythu Vedika at Kodakandla, Rythu Vedika at Kodakandla Mandal Headquarters, Rythu Vedika at Kodakandla Mandal Headquarters in Jangaon, Rythu Vedika Program, Rythu Vedika Program In Jangaon, Telangana CM KCR

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభించనున్నారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సీఎం కేసీఆర్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం ప్రజలకు వివరించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ