ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

Modi Paid Tributes to Sardar Vallabhbhai Patel, National Unity Day, pm narendra modi, PM Narendra Modi has Paid Tributes to Sardar Vallabhbhai Patel, Sardar Vallabhbhai Patel, Sardar Vallabhbhai Patel 145th birth anniversary, Sardar Vallabhbhai Patel Birth Anniversary, Tributes to Sardar Vallabhbhai Patel, Tributes to Sardar Vallabhbhai Patel on his Birth Anniversary

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 145వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్‌తా దివస్‌ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కేవాడియాలో గల ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్ద సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన ఏక్‌తా దివస్‌ పరేడ్‌లో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, నేడు భారత దేశం ఐక్యతకు సంబంధించి కొత్త కోణాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని, ఉగ్రవాదం లేదా హింస మార్గం నుంచి ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని అన్నారు. దేశం ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని పేర్కొన్నారు.

మరోవైపు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్ లేదా కరోనా యోధులను 130 కోట్ల భారతీయులు సత్కరించారని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో దేశంలోని ప్రజలు తమ సమిష్టి సామర్థ్యాన్ని అపూర్వమైన రీతిలో నిరూపించారని అన్నారు. ఇక దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు గుజరాత్‌లోని కేవాడియాలో ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కింద ఆరోగ్య వనం, ఆరోగ్య కుటిర్, ఏక్తా మాల్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కులను ప్రధాని ప్రారంభించారు. ఇక ఈ రోజు కేవాడియా సబర్మతి సీప్లేన్‌ సర్వీస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twenty =