సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే కార్యక్రమంలో భాగంగా శనివారం ‘తెలంగాణ గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్’ను అందించనుంది. 2014 జూన్ నుండి 2024 డిసెంబర్ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 6 గంటలనుంచి అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ వేడుకను తిలకించేందుకు దాదాపు 6వేల మందికి పైగా రానున్నారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. వీరితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు హాజరుకానున్న ముఖ్య అతిథులు వీరే..!
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు
- సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు
- ఐటి అండ్ ఇండస్ట్రీస్ మినిష్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు
- శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు
- హైదరాబాద్ మేయర్ శ్రీమతి జి. విజయలక్ష్మి గారు
- ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు
- ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీ దేవి గారు
- ఎమ్మెల్సీ శ్రీ AVN రెడ్డి గారు
- ఎమ్మెల్సీ శ్రీ సుంకరి రాజు గారు
- ఎమ్మెల్యే శ్రీ ఆరికెపూడి గాంధీ గారు
- GHMC, మాదాపూర్ కార్పొరేటర్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు
- టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారు
- టీఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ గారు