సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే.. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

CM Revanth Reddy Birthday PM Modi, Mamata Banerjee and Across The Political Spectrum Extends Wishes

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు మరియు పలువురు ముఖ్యమంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సొంతపార్టీ కాంగ్రెస్ నాయకులు, కేబినెట్ సహచరులు, కార్యకర్తలు, అభిమానులు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా, రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని తన సందేశంలో ఆకాంక్షించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వీరితోపాటు ఇంకా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా కూడా సీఎం రేవంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సహా దేశ వ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు తమ ప్రియ నేతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తమ ప్రియతమ నేతకు అత్యంత ఉత్సాహంతో శుభాకాంక్షలు చెబుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా, ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్ మరియు బీజేపీకి చెందిన ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఈ ప్రముఖులంతా తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ముఖ్యమంత్రికి విషెస్ తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here