ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress Announced MLC Candidates, MLC Candidates, Congress MLC Candidates, Addanki Dayakar, Balmuri Venkat, Telangana Politics, Congress, MLC Elections, Latest Congress MLC Candidates News, MLC Candidates News Update, MLC, CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Addanki Dayakar, Balmuri venkat, Telangana Politics, Congress, MLC Elections

తెలంగాణలో మరికొద్దిరోజుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 29న పోలింగ్ జరగనుంది. మొత్తం రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల జరగనుండగా.. ఆయా స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థికా ప్రకటించింది. అలాగే ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగనున్నారు.

అయితే మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్వయహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ విమర్శలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ.. ధీటుగా సమాధానమిస్తున్నారు. అటు బల్మూరి వెంకట్ కూడా కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున కాంగ్రెస్ సర్కార్‌పై పెద్ద యుద్ధమే చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని ఎప్పటికప్పుడూ ప్రశ్నిస్తూ వస్తున్నారు..

గతంలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బల్మూరి వెంకట్ బరిలోకి దిగారు. హుజురాబాద్‌లో గెలుపొందడం కోసం వెంకట్ తీవ్రంగా ప్రయత్నించారు. శాయాశక్తుల ప్రయత్నించినప్పటికీ చివరికి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లకు టికెట్ దక్కుతుందని అంతా అనుకున్నారు. వారు కూడా టికెట్ ఆశించారు. కానీ చివరికి హైకమాండ్ ఆ ఇద్దరికి షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కీలక  పదవులు ఇస్తామని ఆ ఇద్దరికి సర్ధిచెప్పింది. ఇప్పుడు సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను బరిలోకి దింపుతోంది.

ఇకపోతే ఎన్నికల సంఘం ఈసారి రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ కోర్టుకు కూడా వెళ్లింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికల నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ అక్కడ బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. అప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉండడంతో.. రెండు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE