స్వల్ప అస్వస్థతకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

Congress MLA Seethakka, Congress MLA Seethakka Health, Congress MLA Seethakka Health Update, Congress MLA Seethakka Suffered with Illness Takes Treatment at Eturnagaram Govt Hospital, Eturnagaram Govt Hospital, Mango News, MLA Seethakka, MLA Seethakka Suffered with Illness Takes Treatment, Seethakka Suffered with Illness, Seethakka Suffered with Illness Takes Treatment, Seethakka Suffered with Illness Takes Treatment at Eturnagaram Govt Hospital

ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీతక్క ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముందుగా మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న దళిత గిరిజన దండోరా ర్యాలీకి ముఖ్య అతిధిగా సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆమె ర్యాలీలో నడుస్తూ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

“సీతక్క ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది, ఏటూరునాగారంలో నిర్వహించిన దళిత గిరిజన భారీ ర్యాలీలో బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె ఇప్పుడు బాగానే ఉంది” అని సీతక్క అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. మరోవైపు సీతక్క త్వరగా కోలుకోవాలని
కోరుకుంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ