దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచిన బీసీసీఐ, అంతర్జాతీయ హోం సీజన్ కు ఆమోదం

BCCI Announces Hike in Match Fee for Domestic Cricketers, BCCI announces hike in match fees, BCCI Announces Match Fee Hike For Domestic Cricketers, BCCI Secretary Jay Shah announces hike in match fee, BCCI’s apex council announces hike in domestic players, Indian Cricket, Mango News, match fee of indian cricketer per match

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 9వ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజును పెంచుతునట్టు ప్రకటించింది. పెంచిన మ్యాచ్ ఫీజుల ప్రకారం ఇకపై 40 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్‌ ఆటగాళ్లకు రోజుకు రూ.60 వేలు, అండర్‌-23 ఆటగాళ్లకు రూ.25 వేలు, అండర్‌-19 ఆటగాళ్లకు రూ.20 వేలు చెల్లించనున్నారు. అలాగే 2019-20 బీసీసీఐ దేశీయ క్రికెట్ సీజన్‌లో పాల్గొన్న క్రికెటర్లు కోవిడ్-19 పరిస్థితుల కారణంగా కోల్పోయిన 2020-21 సీజన్‌కు పరిహారం కింద 50 శాతం మ్యాచ్ ఫీజును అందించనున్నట్టు తెలిపారు. ఇక అండర్-19 టోర్నమెంట్‌ల తర్వాత మరియు కోవిడ్-19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అండర్ 16 టోర్నమెంట్లను నిర్వహించే నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పారు.

మరోవైపు అంతర్జాతీయ హోం సీజన్ 2021-22ను వేదికలతో పాటుగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది. స్వదేశంలో నవంబరు 17, 19, 21వ తేదీల్లో న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, నవంబరు 25- డిసెంబర్ 7 మధ్య రెండు టెస్టుల్లో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఫిబ్రవరి 15, 18, 21 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 మధ్య శ్రీలంకతో రెండు టెస్టులు, మార్చి 13, 15, 18 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. ఇక జూన్‌ 9, 12, 14, 17, 19 తేదీల్లో దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల్లో భారత్ జట్టు తలపడనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 16 =