తెలంగాణ రాష్ట్రంలో జూలై 26, ఆదివారం నాటికీ 3,63,242 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం నాడు 9,817 శాంపిల్స్ పరీక్షించగా, మిలియన్ జనాభాకు 245 మందికి పరీక్షలు చేసినట్టుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి మిలియన్ జనాభాకు రోజుకు కనీసం 140 మందికి పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. మరోవైపు కొత్తగా 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 26 రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 55,532 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 471 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.85 (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 774 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 42,106 కి చేరింది. ప్రస్తుతం 12,955 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 506, రంగారెడ్డిలో 168, వరంగల్ అర్బన్ లో 111, సంగారెడ్డిలో 98, కరీంనగర్ లో 91, మేడ్చల్ లో 86, నిజామాబాద్ లో 41, మహబూబాబాద్ లో 34, సూర్యాపేటలో 32, జోగులాంబ గద్వాల్ లో 32, ఆదిలాబాద్ లో 28, నల్గొండలో 28, ఖమ్మంలో 20, నాగర్ కర్నూల్ లో 19, రాజన్న సిరిసిల్లలో 19, జగిత్యాలలో 18, కామారెడ్డిలో 17, మెదక్ లో 17, మంచిర్యాలలో 14, ములుగులో 12, సిద్దిపేటలో 12, యాద్రాద్రి భువనగిరిలో 11, భద్రాద్రి కొత్తగూడెం లో 10, జనగామలో 10, జయశంకర్ భూపాలపల్లిలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu